Header Banner

పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు! ఓడిపోయాం.. ఒప్పుకుంటున్నా! చైనీస్, టర్కీ ఆయుధాలు ధ్వంసం!

  Sat May 17, 2025 11:00        Others

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్ అబద్దాలు చెప్పుకుంటూ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ ఏమీ కోల్పోలేదని.. యుద్ధం తామే గెలిచామని.. భారత్ కే నష్టం వాటిల్లిందంటూ ఇన్నిరోజులూ బుకాయిస్తూ వచ్చింది. అయితే తాజాగా తన ఓటమిని పాకిస్థాన్ అంగీకరించింది. భారత్ దెబ్బకు తాము ఓడిపోయామని బహిరంగంగానే ఆ దేశ ప్రధాని ఒప్పుకున్నారు.

 

ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. అత్యాధునిక క్షిపణులతో భారత్ చేపట్టిన దాడికి పాకిస్థాన్ అతలాకుతలం అయింది. ఆ దేశంలోని అనేక మిలిటరీ స్థావరాలపై భారత్ దాడులు చేసి కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఇన్ని రోజులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని విక్టరీ ర్యాలీలు కూడా తీసింది. తాజాగా తన తప్పు తెలుసుకున్న పాకిస్థాన్.. ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. తాము ఓడిపోయామని స్వయంగా ఆ దేశ ప్రధాని బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

 

ఇది కూడా చదవండి: పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష! హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్!

 

" ఆపరేషన్ సిందూర్ లో భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పుకున్నారు. శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రధాని షెహబాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. "మే 9,10 మధ్య రాత్రి భారత్‌ దాడులు ప్రారంభించాక ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. రావల్పిండి లోని నూర్ ఖాన్‌ మిలిటరీ ఎయిర్ బేస్ తో పాటు ఇతర స్థావరాలపై దాడి జరిగింది. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనా యుద్ధ విమానాలను వినియోగించింది. అని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ తెలిపారు.

 

మరోవైపు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 600 పాకిస్థాన్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా నేల కూల్చిందని కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. దేశ సరిహద్దులో వేయికి పైగా ఏడీ గన్ సిస్టమ్స్, 750 షార్ట్ అండ్ మీడియం రేంజ్ సర్ ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్స్ మోహరించామని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ లో ఆ నాలుగు రోజులు వీరోచితంగా పోరాటం చేశామని పేర్కొంది.


ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #PakistanPM #SensationalRemarks #WeLost #PakistanAdmitsDefeat #ChineseWeaponsDestroyed